MAA Elections: ప్యానెల్ ప్రకటించిన మంచు విష్ణు

హైదరాబాద్ (CLiC2NEWS): మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని తెలుస్తుంది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నర్సింహరావు పోటీ పడుతున్నారు. ప్రకాశ్‌రాజ్ ఇప్పటికే తన ప్యానల్‌ని ప్రకటించి.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు తగిన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ జరగనుంది. అందే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ తరుణంలో గురువారం ఉదయం మంచు విష్ణు తన ప్యానల్‌ని ప్రకటించారు. తన ప్యానల్ వివరాలు ఆయన వెల్లడించారు.
- 1. మంచు విష్ణు – అధ్యక్షుడు
- 2. రఘుబాబు – జనరల్ సెక్రటరీ
- 3. బాబు మోహన్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
- 4. మాదాల రవి – వైస్ ప్రెసిడెంట్
- 5. పృథ్వీరాజ్ బాలిరెడ్డి – వైస్ ప్రెసిడెంట్
- 6. శివబాలాజీ – కోశాధికారి
- 7. కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ
- 8. గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు
- 9. అర్చన
- 10. అశోక్‌కుమార్
- 11. గీతాసింగ్
- 12. హరినాథ్‌బాబు
- 13. జయవాణి
- 14. మలక్‌పేట్ శైలజ
- 15. మాణిక్
- 16. పూజిత
- 17. రాజేశ్వరీ రెడ్డి
- 18. సంపూర్ణేశ్ బాబు
- 19. శశాంక్
- 20. శివన్నారాయణ
- 21. శ్రీలక్ష్మి
- 22. శ్రీనివాసులు
- 23. స్వప్న మాధురి
- 24. విష్ణు బొప్పన
- 25. వడ్లపట్ల
- 26. రేఖ
For my MAA, our privilege and honor 🙏 pic.twitter.com/Ow3Cdrvsec
— Vishnu Manchu (@iVishnuManchu) September 23, 2021