మగువల రాతలు ఈ మట్టిలో కలిసిపోతున్నాయి..!
మగ మృగాల వికృత చేష్టలకు అవనిపై ప్రతి రోజూ సగటు
ఆడవారు కన్నీటి ప్రవాహములో తడిసి నిద్ర లేస్తుంది.!
మగ మృగాలు నీతులు వల్లిస్తూ గోతులు తవ్వుతూ ముందుకు సాగుతుంటే
నమ్మిన ఎందరో మగువల రాతలు ఈ మట్టిలో కలిసిపోతున్నాయి..!
మగ మృగాలు పైకి మాత్రం మహిళల కోసం న్యాయపోరాటము చేస్తున్నట్టు నటిస్తూ
ఆడది అయితే చాలు ముసలి ముతకా అని చూడకుండా వేటాడి వెంటాడి చిధిమెస్తూ….,
భారతమాత మహిళా సాధికారత కోసం కన్న కలలను మంట కలిపివేస్తున్నారు.!
మగ మృగాలు నీతులు వల్లిస్తూ గోతులు తవ్వుతూ ముందుకు సాగుతుంటే
నమ్మిన ఎందరో మగువల రాతలు ఈ మట్టిలో కలిసిపోతున్నాయి..!
అవనిలో అనుక్షణం మగ మృగాల కోరల్లో చిక్కుకొని మరణిస్తున్న ఆడవారి కోసం
భద్రకాళీవై మగ మృగాలను చంపి మగువల జీవితంలో కొత్త వెలుగులు నింపాలి రా కదలి రా.!
మగ మృగాలు నీతులు వల్లిస్తూ గోతులు తవ్వుతూ ముందుకు సాగుతుంటే
నమ్మిన ఎందరో మగువల రాతలు ఈ మట్టిలో కలిసిపోతున్నాయి..!
ఎన్ని నాళ్లు ఇలా ఆడవారిపై అకృత్యాలు,
అయ్యా, అన్నా,తమ్మీ దయచేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకునే
బాధ్యత మన అందరిపైనా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి.
-మంజుల పత్తిపాటి