యాదాద్రిలో మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ: సిఎం కెసిఆర్
యాదాద్రి (CLiC2NEWS): యాదాద్రి ఆలయం పునఃప్రారంభం ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురు చూస్తున్నవిషయం తెలిసిందే. మంగళవారం యాదాద్రిలో పర్యటించిన సిఎం కెసిఆర్ ముహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని సిఎం తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనన్నట్లు సిఎం తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం ఉంటుందని సిఎం వివరించారు.