ఈనెల 28వ తేదీన యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ
యాదాద్రి (CLiC2NEWS): యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు. చినజీయర్ స్వామి నిర్ణయించిన మూహూర్తానికి ఈనెల 28న ఉదయం 11.55 గంటలకు పునర్నిర్మితమైన పంచనారసింహుల ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. ఉద్ఘాటన పర్వానికి ఈనెల 21వ తేదీన అంకురార్పణ మొదలవుతుందని పేర్కొన్నారు. మహా సంప్రోక్షణ తరువాత బాలాలయంలోని ప్రతిష్టామూర్తులను ప్రధానాలయంలోకి చేర్చుతామని, అనంతరం స్వయంభువుల నిజదర్శనాలకు తెరతీసి భక్తులకు ప్రధానాలయంలోకి అనుమతిస్తామని వివరించారు.