మ‌హారాష్ట్రలో అధిక్యంలో దూసుకెళ్తున్న‌ మ‌హాయుతి కూట‌మి

ముంబ‌యి (CLiC2NEWS): మ‌హారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో మ‌హాయుతి ఆధిక్యంలో కొన‌సాగుతోంది. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాల్లో కూట‌మి 200 సీట్ల‌కు పైగా ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో మ‌హాయుతి కూట‌మిలో బిజెపి 149 , శివ‌సేన 81, ఎన్‌సిపి 59 స్థానాల్లో పోటీ చేయ‌గా.. ఎంవిఎలో కాంగ్రెస్‌, శివ‌సేన 95, ఎన్‌సిపి (ఎస్‌పి) 86 సీట్ల‌లో పోటీ చేశారు. బిఎస్‌పి 237 స్థానాల్లో, ఎంఐఎం 17 చోట్ల బ‌రిలోకి దిగాయి.

ఈ నెల 26వ తేదీతో మ‌హారాష్ట్ర అసెంబ్లీ గ‌డువు ముగుస్తున్న నేప‌థ్యంలో 72 గంట‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిఉంది. దీంతో రాష్ట్ర సిఎంగా ఎవ‌ర‌నేదానిపై చ‌ర్చ మొద‌లైంది. మ‌హారాష్ట్ర సిఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టేది బిజెపి నేత‌ దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో నేత‌లు ఈ రోజు మూడు గంట‌ల‌కు స‌మావేశం కానున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు బిజెపి పార్టి అగ్ర‌నాయ‌కులు రేపు ముంబయికి రానున్న‌ట్లు తెలుస్తోంది.

 

Leave A Reply

Your email address will not be published.