సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూత

హైదరాబాద్ (CLiC2NEWS): సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రమేష్ బాబు 1987లో సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అంతకుముందు రమేష్ బాబు 1974లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. కొంతకాలం గ్యాప్ తీసుకుని సామ్రాట్ సినిమాలో హీరోగా పరిచయమయ్యారు.
1997 నుంచి నటుడిగా దూరంగా ఉన్న రమేష్ బాబు 2004లో నిర్మాతగా అర్జున్, అథితి సినిమాలు నిర్మించారు.