తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేశ్ కుమార్‌గౌడ్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేశ్ కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. అ పదవి కోసం ప్రచార కమిటి ఛైర్మన్ మధుయాస్కి గౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మహబూబాబాద్ ఎంపి బలకాం నాయక్ పోటీ పడ్డారు. మహేశ్ కుమార్‌గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. జులై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియడంతో అప్పటి నుండి అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది.