జీడిమెట్ల: కెమికల్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం
మేడ్చల్ (CLiC2NEWS): నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామికవాడ పరిధిలోని దూలపల్లిలో ఉన్న రిషిక కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.