ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 20 గుడిసెలు దగ్ధం
ముగ్గురు చిన్నారులు, మహిళ సహా ఆరుగురికి గాయాలు
ఏలూరు (CLiC2NEWS): జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవిచింది. మండవల్లి మండలం భైరవపట్నంలో హైవే పక్కన ఉన్న గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 20 గుడిసెలు దగ్దమయినట్లు సమాచారం. ఆరుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు చిన్నారులు, మహిళ ఉన్నారు. క్షతగాత్రలను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుసి సహాయక చర్యలు చేపట్టారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వేటగాళ్లు 20 ఏళ్లుగా హైవేపక్కనే గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. శుక్రవారం రాత్రి
దోమలు నివారణకు కాయిల్ వెలిగించగా.. మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. నాటు తుపాకీలో మందుగుండు సామాగ్రికి మంలందుకుని పెను ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు గుడిసెలు అన్నిటికీ అంటుకోవటంతో గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.