చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్ లోని మొదటి అంతస్తులో మంటలు అలుముకొన్నాయి. దట్టమైన పొగతో భవనమంతా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆభవనంలో ఉన్న వారు ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. మృతులలో ఇర్దరు చిన్నారులు , నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా, మలక్‌పేట , యశోద హాస్పిటల్‌కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఘటనా స్థలానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర తరపున సాయం అందిస్తామని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి అక్కడి వివరాలు తెలుసుకున్నారు.
గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న సిఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.