జీడిమెట్ల‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

 7ఫైర్ ఇంజిన్లు, 40వాట‌ర్ ట్యాంక‌ర్ల‌తో మంట‌ల‌ను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని జీడిమెట్ల పార‌శ్రామికి వాడ‌లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ప‌రిశ్ర‌మ‌లోని మూడో అంత‌స్తులో చెల‌రేడిన మంట‌లు గ్రౌండ్‌ఫ్లోర్ వ‌ర‌కూ వ్యాపించాయి. మొద‌టి అంత‌స్తులో పాలిథిన్ సంచుల త‌యారీకి వినియోగించే ముడి స‌ అగ్నిమాప‌క సిబ్బంది,డిఆర్ ఎఫ్‌, జిహెచ్ ఎంసి, నాలుగు పోలీసు స్టేష‌న్లక చెందిన సిబ్బంది తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ర‌కు ఉంది. దీంతో మంట‌లు అదుపు చేయ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది. 7 ఫైర్ ఇంజిన్లు, 40 వాట‌ర్ ట్యాంక‌ర్ల సాయంతో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
భ‌వ‌నం మొత్తం ద‌ట్ట‌మైన పొగ వ్యాపించింది. ఎంత ప్ర‌య‌త్నించినా మంటలు అదుపులోకి రావ‌డం లేదు. చీక‌టి ప‌డ‌టంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌ల‌గ‌వ‌చ్చున‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు భ‌వ‌నం కూలిపోయే స్తితికి చేరిన‌ట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.