మగ సమాజం
దేశంలో రాష్ట్రాలెన్ని, ప్రశ్న ఇది అప్రస్తుతమే మరి
మొత్తం 29 లో ముఖ్యమంత్రులు ఎవరెవరు
ఒక్కరంటే ఒక్కరే ఈ పదవిలో నేడు
మహిళల అడ్రస్‌కు ఈ పర్సంటేజీ ఎంత
ఎక్కడుందీ సమానత్వం, ఎప్పటికీ తీరుతుంది
ఎవరిది ఈ పాపం ఎందుకు ఈ అసమానత
ఏమిటీ మళ్లీ ఆడపిల్లేనా
భూమి మీద పడిపడకముందే
ప్రారంభమవుతున్నది వివక్ష
అపరపరాశక్తి, అమ్మలగమ్మ అమ్మ
మాటలకేమి కొదవలేదు
మారడం లేదు మనుష్యులెందుకో
చిలీ దేశంలో మహిళదే ఆధిక్యత
ఈ మాతృస్వామ్య వ్యవస్థ విస్తరించాలి అంతటా
ఇందిరమ్మ ప్రధాని అయినా, నియంతగా అపఖ్యాతి వచ్చినా
ఎదగలేదు ఇతరులు ఆమెకు దరిదాపుకు
అస్వంత్రులుగా ఎందురుంటేనేమి
అనాధిగా అదే మూస బతుకులు
భార్య పదవిలోకి వచ్చినా ఆ సీటు భర్తదే
మార్పు రావాల్సింది అక్కడే
మగవాళ్లకే చమటలు పట్టిస్తూ మమత దీదీ
నేటి అబలలకు ఆదర్శ సిఎం ఆమె..,
కాళ్లకు సాగిలపడినా పట్టించుకోని జయలలిత
బెహన్ మాయవతికి తప్పడం లేదు సమస్యలు
రాజ్యాధికారంతోనే ఆధిక్యత పెరుగుతుంది
సమాజంలో వారికి సమానావకాశాలు
సగం మీరే, సాగదు ఏకపక్ష పదవుల పంపకం
మంచిమాటలు మాయమాటలతో కాలక్షేపం
మూడో వంతు రిజర్వేషన్ బిల్లు
మూలుగుతున్నది చట్ట సభల్లో ఏళ్ల తరబడి
పురుషాహంకారమే పాలిస్తున్నది
సమూల మార్పునకే మనసు ఆరాటం
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు
తప్పక చదవండి:
అహం అదే ఇగో
విమాన యానం
రాజకీయ జలకాలా`టలా`
కోనేటి రంగయ్య: ఆశల పల్లకిలో..
కోనేటి రంగయ్య: మనసు ఆరాటం