తెలంగాణ‌ సాయుధ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం క‌న్నుమూత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): సిపియం కేంద్ర క‌మిటి స‌భ్యురాలు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం (91) క‌న్నుమూశారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాద‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం తుది శ్వాస విడిచారు.

1945-48 మ‌ధ్య కాలంలో జ‌రిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మ‌ల్లు స్వ‌రాజ్యం తుపాకీ చేత‌ప‌ట్టి ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలిచారు. గ్రామాల్లో ఉన్న ప్ర‌జ‌ల్ని క‌దిలించేలా పెద్ద ఎత్తున స‌భ‌లు నిర్వ‌హించేవారు. ఆనాటిర‌జాక‌ర్ల ఆగ‌డాల‌కు వ్య‌తిరేకంగా బ‌తుక‌మ్మ పాట‌ల‌తో, ఉపన్యాసాల‌తో మ‌హిళ‌ల్ని చైత‌న్య ప‌ర‌చ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. సాయుధ పోరాట కాలంలో మ‌ల్లు స్వ‌రాజ్యంతో పాటు 300 మంది మ‌హిల‌లు మేజ‌ర్ జైపాల్ సింగ్ ఆధ్వ‌ర్యంలో సాయుద శిక్ష‌ణ పొందారు. 1978,1983లో తుంగ‌తుర్తి శాస‌న‌సభ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అఖిల భార‌త మ‌హిళా సంఘం (ఐద్వా) నాయ‌కురాలిగా అనేక మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశారు.

Leave A Reply

Your email address will not be published.