`కోరమాండల్` మృతుల కుటుంబాలకు సర్కార్ కొలువులు : మమత ప్రకటన
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/mamtha-benerjee.jpg)
కోల్‌కతా (CLiC2NEWS): కోరమాండల్ రైలు ప్రమాద బాధితులను ఆదుకొంటామని బెంగాల్ సిఎం మమత బెనర్జీ ప్రకటించారు. ఈ మేరకు సిఎం మమత కీలక నిర్ణయం తీసుకున్నట్లు కోల్‌కతాలో సోమవారం మీడియాకు తెలిపారు. బెంగాల్‌కు చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి సర్కార్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సిఎం ప్రకటించారు. అలాగే తీవ్రగాయాలతో అవయవాలుకోల్పోయిన వారి కుటుంబాలకు సైతం సర్కార్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇంకా ఈ ప్రమాదంలో శారీరక గాయాలు, మానసికంగా బాధపడుతున్న వారికి నగదు సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ దవాఖానాల్లో ఇకిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నట్లు సిఎం ప్రకటింఆచరు. దాదాపు బెంగాల్‌కు చెందిన 206 మంది గాయాలతో వివిధ ఆసుపత్రులలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో 33 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు.. దీదీ తెలిపారు.