ప్ర‌ధాని మోడీతో మ‌మ‌తా భేటీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మంగ‌ళ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీనికి క‌లిశారు. ఈ మ‌ధ్య కాలంలోనే ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఈ ఇద్ద‌రూ తొలిసారి క‌లుసుకున్నారు. ఈ మేర‌కు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మ‌మతా బెన‌ర్జీ ప్ర‌ధాన మంత్రి నివాసానికి వెళ్లారు. రాష్ట్రానికి బాకీ ఉన్న నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని మ‌మ‌తా కోరిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ల‌ను కూడా అధిక మొత్తంలో రిలీజ్ చేయాల‌ని ఆమె అభ్య‌ర్థించారు.

కాగా ఇవాళ ఉద‌యం ఢిల్లీలో కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్‌ను ఆమె క‌లిశారు. రేపు సోనియాతోనూ మ‌మ‌త భేటీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.