భ‌వానీపూర్ లో ఘ‌న విజయం సాధించిన మ‌మ‌తా బెన‌ర్జీ

కోల్‌క‌తా (CLiC2NEWS): ప‌శ్చిమ బెంగాల్ సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ భ‌వానీపూర్ నియోజ‌కవ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై 58,832 ఓట్ల మెజార్టీతో మ‌మ‌త గెలిచారు.
రౌండ్ రౌండ్‌కు దీదీ మెజారిటీ పెరిగి 50 వేల‌కు పైగా చేరింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మ‌మ‌తా.. ఆ త‌ర్వాత ప్ర‌తి రౌండ్‌కూ త‌న ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు

ఈ ఎన్నిక‌లో మొత్తంగా మ‌మ‌త‌కు 84,709 ఓట్లు రాగా.. ప్రియాంకాకు 26,320 ఓట్లు వ‌చ్చాయి. త‌న ఓట‌మిని ప్రియాంకా అంగీక‌రించారు. అయితే వాళ్లు ల‌క్ష‌కుపైగా మెజార్టీ గెలుస్తామ‌ని చెప్పార‌ని, ఇప్పుడు అది 50 వేల‌కే ప‌రిమిత‌మైంద‌ని ఆమె అన్నారు. మ‌రోవైపు త‌న‌ను గెలిపించిన భ‌వానీపూర్ ప్ర‌జ‌ల‌కు మ‌మ‌త కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

భ‌వానీపూర్ ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటా…

ఉపెన్నిక‌లో భారీ విజ‌యం అనంత‌రం స్పందించిన మ‌మ‌తా బెన‌ర్జీ .. భ‌వానీపూర్ ప్ర‌జ‌ల‌కు నేనెప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను అని మ‌మ‌తా అన్నారు. ` భ‌వ‌నీపూర్ ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. దేశ‌వ్యాప్తంగా ఉన్న సోద‌రీ, సోద‌రీమ‌ణులు, త‌ల్లుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ముఖ్యంగా భ‌వ‌నీపూర్ ప్ర‌జ‌లు నాపై ఉంచిన విశ్వాసానికి సంతోషిస్తున్నాను. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాను` అని మ‌మ‌త పేర్కొన్నారు.

కాగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మ‌మ‌తా బెన‌ర్జీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతుల్లో ఓడిన విష‌యం తెలిసిందే. అయితే ఆమె ఇన్నాళ్లూ ముఖ్యమంత్రిగానే కొన‌సాగుతున్నారు. ఆ ప‌ద‌విలో కొన‌సాగాలంటే ఈ ఉప ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా గెల‌వాల్సిన స్థితిలో మ‌మ‌త భారీ మెజార్టీతో గెలిచారు.

Leave A Reply

Your email address will not be published.