చేయి కోసుకొన్న ప్రియురాలు.. ఆగిన ప్రియుని గుండె!

న్యూడిల్లీ (CLiC2NEWS): అపార్థాల కారణంగా ఓ ప్రేమ జంట కథ విషాదమయంగా మారింది. అన్యోన్యంగా ప్రేమించుకున్న ఆ జంట కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఆమె న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి, అతడు ఉద్యోగ అన్యేషణలో ఉన్న నిరుద్యోగి. అయితే విషయంలోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతానికి చెందిన ఆ యువతి చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకొని, ఆ వీడియోను తన ప్రియుడైన అరుణ్ నందా (30)కి వాట్సాప్‌లో పంపింది.
ఆ వీడియోని చూసిన అరుణ్ నందా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని చూసి అరుణ్ నందా సృహ తప్పి పడిపోయాడు. వెంటనే డాక్టర్లు నందాను పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు, ఈ ఘటన శనివారం ఢిల్లీలో జరిగింది.
కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఆనంద్ విహార్ పోలీసులు అరున్ నందా గుండె ఆగి మరణించి ఉంటాడని, పోస్టు మార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి ఇప్పుడు మెరుగ్గానే ఉంది.