Mancherial: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మంచిర్యాల (CLiC2NEWS): పట్టణంలోని గర్మిళ్ల పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 1994-95 బ్యాచ్ పదవతరగతి విద్యార్థులు స్థానిక వి కన్వెన్షన్ హాలులో కలుసుకున్నారు. పదవతరగతి పూర్తయ్యి 30 సంవత్సరాలు గడిచిన సందర్బంగా వారందరూ ఒకచోట కలుసుకుని తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. అందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ, పలకరించుకున్నారు. 30 సంవత్సరాల తమ జీవిత ప్రయాణం గురించి ఒకరికొకరు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో 70మందికి పైగా పాల్గొన్నారు.