గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
మంచిర్యాల (CLiC2NEWS): గోదావరికి స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మంచిర్యాల చెన్నూరు మండలం సుందరశాల గ్రామానికి చెందిన దాసరి సాయి, అరుణ్ అనే విద్యార్థులు శుక్రవారం ఉదయం గోదావరిలోకి స్నానానికి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్నా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.