సినీ పరిశ్రమలో మహిళల రక్షణ.. కమిషన్ వేయాలని కోరిన మంచు విష్ణు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు సినీ పరిశ్రమలో మహిళల రక్షణ నిమిత్తం కమిషన్ ఏర్పాటు చేయాలని మాఅధ్యక్షుడు మంచు విష్ణు ప్రభుత్వాన్ని కోరారు. మహిళల భద్రత, రక్షణను మరింత మెరుగుపరచడం కోసం వారి తరపున ప్రాతినిధ్యం వహించేలా ఓ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళకు రక్షణ, భద్రత మరింత మెరుగుపడేల వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు యాలని మా అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, సినిమాటో గ్రఫిశాఖ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. కెమెరా ముందు వెనుక ప్రతి ఒక్కరికి భద్రతతో కూడిన పరిస్తితులు ఉండాలన్న దానిక మేము ప్రాధాన్యం ఇస్తున్నామని చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మా ఎపుడూ కట్టుబడి ఉందన్నారు.