Mandapet: ఉత్తమ ఉపాధ్యాయులు

మండపేట (CLiC2NEWS): మండ‌పేట రూర‌ల్‌, అర్భ‌న్ ప్రాంతాల్లో ప‌లువురు టీచర్లు ఉత్త‌మ ఉపాధ్యాయులుగా ఎంపిక‌య్యారు. ద్వార‌పూడి జిల్లా పరిష‌త్ బాలికోన్న‌త పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయురాలు బ‌త్తిన రాజేశ్వ‌రి, వేగుళ్ల సూర్యారావు ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఇంగ్లీష్ లెక్చ‌ర‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న స‌మ‌ర్ప‌ణ కుమార్ రాష్ట్ర స్థాయి ఉత్త‌మ అవార్డుకు ఎంపిక‌య్యారు. పట్టణంలోని వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రేలంగి నాగకుమార్, సర్దార్ వేగుళ్ల వీర్రాజు మునిసిపల్ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మేకా రామలక్ష్మి, కేశవరం మండల ప్రాథమిక పాఠశాల పీ ఎస్ హెచ్ ఎం చోడే కృష్ణమూర్తిలు జిల్లా స్తాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు మండ‌ల విద్యాశ‌ఖ అధికారి నాయ‌డు రామ‌చంద్రారావు తెలిపారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా  ఉన్నతాధికారుల చేతుల మీదుగా వీరు ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డులు అందుకోనున్నారు.

 

Kamareddy: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు..

Leave A Reply

Your email address will not be published.