జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న చోడే కృష్ణమూర్తి

మండపేట (CLiC2NEWS): మండ‌పేట మండ‌లోని కేశ‌వ‌రం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చోడే కృష్ణమూర్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమలాపురం గోదావరి భవన్‌లో కేశవరం జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. కృష్ణమూర్తి గతంలో మోదూకూరు, ఒడిసిలేరు, హుకుంపేట, వెలగతోడు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వ‌హించారు. అనేకమంది విద్యార్థులను తన బోధన ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దారని మండల విద్యాశాఖ అధికారులు నాయుడు రామచంద్రరావు, సోమిరెడ్డిలు కొనియాడారు. ఈ అవార్డు అందుకోవ‌డం తన బాధ్యతను మరింత పెంచింద‌ని కృష్ణ‌మూర్తి ఈ సంద‌ర్భంగా అన్నారు. యుటిఎఫ్ నాయకులు తాడి శ్రీనివాస్, డీ శ్రీనివాసరావు, గంటి వీర్రాజు, ఎస్‌టీయూ నాయకులు కూచి వీర రాఘవులు, ప్రధానోపాధ్యాయులు వీ రమణ, ముంగర వెంకటరాజు తదితరులు కృష్ణ‌మూర్తికి అభినందనలు తెలిపారు.

 

Also Read: Mandapet News: Mandapet: ఉత్తమ ఉపాధ్యాయులు

 

Leave A Reply

Your email address will not be published.