మ‌ణిపూర్ సిఎంగా బీర‌న్‌సింగ్ రెండోసారి.. ప్ర‌క‌టించిన బిజెపి

ఇంఫాల్  (CLiC2NEWS): ఈశాన్య రాష్ట్రమైన మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రిగా బీర‌న్ సింగ్ మ‌రోసారి ఆ రాష్ట్ర సిఎం గా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 60 స్థానాల‌కు గాను 32 స్థానాల‌లో బిజెపి గెలుపొందిన‌ విష‌యం తెలిసిన‌దే. దీంతో ముఖ్య‌మంత్రి బ‌రిలో ముగ్గురు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. కేంద్ర‌మంత్రులు, నిర్మ‌లా సీతారామ‌న్‌, కిర‌న్ రిజిజు ఆదివారం ఇంఫాల్ వెళ్లారు. పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించి సిఎంను ప్ర‌క‌టించారు. బీర‌న్‌సింగ్ 2017లో మొద‌టి సారిగా ముఖ్య‌మంత్రి అయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.