నాన్నకు ప్రేమతో..

గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి,  ఓడినప్పుడు భుజంపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకి తీసుకుని హత్తుకునే వ్యక్తి నాన్న..! ప్రతి ఆడపిల్ల జీవితంలో తండ్రి ఓ మధురమైన అనుభూతి కావాలి, చేయూత కావాలి,అందమైన బంధం కావాలి, తండ్రి తోడు ప్రతి బిడ్డకు ఓ రక్షణ కవచం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మగపిల్లలకంటే తండ్రితో ఆడపిల్లలకి అనుబంధం ఎక్కువ. బొమ్మలు ఎన్ని బహుమతిగా ఇచ్చినా నాన్న ఉంటే చాలు, నిజమే కదా. బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ నాన్న ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది మనకు.

 

నాన్న లేకపోతే పిల్లల పరిస్థితి ఏలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిన జీవిత సత్యం నాన్నతో ప్రయాణం..!
నాన్న నేనునిన్ను నక్షత్రాలలో అమరత్వం చేయను, ఎందుకంటే అవి మసకబారుతాయి. ఒక కవితతో నేను మిమ్మల్ని గుర్తుంచుకోను, ఎందుకంటే ఒక రోజు అది మరచిపోతుంది. నేను నిన్ను నా హృదయంలో భద్రంగా ఉంచుతాను నాన్న..!
భుజాన ఎత్తుకుని ప్రపంచాన్ని చూపించి ధైర్య శౌర్య పరాక్రమాల్ని నేర్పిన నాన్న కు మనమేమివ్వగలం నాన్నకు కృతజ్ఞతలతో పాదాభి వందనం చేయడంతప్ప. నాన్నకు ప్రేమతో..

-మంజుల పత్తిపాటి
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

Leave A Reply

Your email address will not be published.