కన్న కూతురిని చంపిన కేసులో నిందుతుడు అరెస్టు
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): ఓ కసాయి తండ్రి కన్న కూతురిని గొడ్డలితో నరికి చంపిన కేసులో పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మంథని మండలం బట్టుపల్లిలో గుండ్ల సదయ్య తన కన్న కూతురైన రజితను గొడ్డలి తో నరికి చంపి.. శ్రీనివాస్ అనే వ్యక్తిపై కూడా గుడ్డలితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి నిందితుడుని అదుపులో తీసుకున్నారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గుండ్ల సదయ్య కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య శ్రీలత కిందటేడాది కుటుంబ కలహాల మూలంగా ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం సదయ్య తన ఇద్దరు పిల్లలు కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడు. అతను ఏ పని చేయక ఇంట్లోనే కాలిగా ఉంటూ.. తన కొడుకు అంజి వద్ద నుండి డబ్బులను మందు త్రాగడానికి వాడుకుంటుంటే వాడు, ఇదే క్రమంలో తండ్రికి ఇద్దరు పిల్లలకి మనస్పర్ధలు రావడంతో గుండ సదయ్య అప్పుడప్పుడు వాళ్లను బెదిరించేవాడు. తన కొడుకు అంజి తనకు అవసరాలకు డబ్బులు అడుగుతే ఇవ్వట్లేదని మనసులో పెట్టుకొని, కొడుకు అంజి పని మీద బయటకు వెళ్లగా, తన కూతురు రజితను తన ఇంట్లోనే గొడ్డలితో తలపై బలంగా కొట్టడంతో.. అక్కడికక్కడే మృతి చెందింది. అదే గొడ్డలితో సదయ్య ధూపం శ్రీనివాస్‌పై గొడ్డలితో దాడి చేశాడు. మృతురాలు మేనమామ, కిరాణ షాప్ ఓనర్ అయినా దూపం శ్రీనివాస్ ,ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందుతునిపై కేసు నమోదు చేసి.. విచారణ అనంతరం నిందుతున్ని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడు గతం లో బట్టుపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రాజేష్ అని వ్యకిపై దాడి చేసిన సంఘటనలో కూడా అతనిపై కేసు నమోదయింది.