లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా దొరికిన మానుకోట సబ్‌రిజిస్ట్రార్
మహబూబాబాద్ (CLiC2NEWS): మానుకోట సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. దాట్ల గ్రామానికి చెందిన హరీశ్ స్థలం రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ తస్లీమా దగ్గరకు వెళ్లగా.. గజానికి రూ. 200 చొప్పున డిమాండ్ చేసినట్లు సమాచారం. దాంతో బాధితుడు అంత ఇవ్వలేనని.. రూ. 150 చొప్పున ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. తస్లీమాకు డబ్బులు ఇస్తుండగా అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 19,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బంది దగ్గర ఉన్న 1.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.