రోజుకో ఆపిల్ తింటే ఎన్నో ప్రయోజనాలు..

ఆపిల్ ఇది ఈ సీజన్లోలో బాగా దొరుకుతాయి. ఆపిల్ ని సంస్కృతంలో సెబా ఫలం అంటారు. తెలుగులో ఆపిల్ కాయ అంటారు.
మన భారతదేశంలో కాశ్మీర్లో లభించే ఆపిల్ కి మంచి గిరాకీతో పాటు పేరు ప్ర‌ఖ్యాత‌లున్నాయి. అంతర్జాతీయంగా ఆపిల్స్ కూడా పండిస్తున్నారు. ఆపిల్స్ దాదాపు 20 రకాలున్నాయి. ఆపిల్ పండే నేల, ప్రాంతం బట్టి ఆపిల్ రుచి ఆధారపడి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ చాలా బెస్ట్ గా ఉంటాయి. చక్కని రుచి కలిగి ఉంటుంది.

ఆపిల్ చూడగానే అందరికి నోరూరుతుంది. అది అందంగా ఆకర్షణీయంగా, చూడగానే కోరుక్కొని తినాలి అనిపిస్తుంది. ఇది అతిమధురమైనది, రుచి కలది, నోట్లో వేసుకుగానే లాలజం ఊరుతుంది. ఆపిల్ అంత మధురంగా ఉందంటే అందులో ఫ్రక్టోజ్ అధిక శాతంలో ఉండటమే కారణం.

అందమైన ఆపిల్ లో పోషక విలువలు కూడా వున్నాయి. కార్బొ హైడ్రెట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పోస్పోరస్, కొవ్వు, ఐరన్, పోటాషియం, సల్పర్, సోడియం, మెగ్నీషియం, క్లోరిన్, కాపర్, విటమిన్, A, E, విటమిన్ B1, B6, పాంతోనిక్ ఆసిడ్, బయోటిన్, విటమిన్ C, అగ్లాలిక్ ఆసిడ్, అయోడీన్, ఐసోసిటల్, ఫ్రాక్టోజ్, గ్లోకోస్,సుక్రొజ్ ఉంటాయి.

ఆపిల్ చక్కగా ముక్కలుగా చేసి వాటిలో మంచి తేనే కలిపి మరియు పాలను కలిపి తాగాలి. ఇది చక్కని nerve టానిక్ గా పనిచేస్తుంది. గ్లూటమిక్ ఆసిడ్ అనేది ఇందులో ఉంటుంది. ఊడి nerve సిస్టం ను తన అధీనంలోకి ఉంచుకొని మనం చాలా కాలం జీవించటానికి సహకరిస్తాయి. గ్లూటమిక్ ఆసిడ్ సిందసిస్ కు అవరోధం కలిగిన యెడల జ్ఞాపక శక్తి క్షిణిస్తుంది. మనం ఏదైనా పని చేయాలంటే శ్రద్ధ, ధ్యానం, లేకపోవటం ఒత్తిడి, చిరాకు, సోమరితనం, సుసైడల్ దెండెన్సీ ఈ లక్షణాలు కనిపిస్తాయి.

అంతే కాకుండా, అతిసారం, యూరిక్ ఆసిడ్, గ్యాస్ట్రిక్, గుండె జబ్బులు, ఫీట్స్, అర్షమొలలు, మలబద్ధకం,చర్మ సౌందర్యం అజీర్తికి, హై బ్లడ్ ప్రెషర్ కి, తల తిరుగుట, ఇంకా చాలా వ్యాధులకు ఆపిల్ మంచి ఔషాదం గా పనిచేస్తుంది. ఆపిల్ గురించి చెప్పటంకంటే దానిని తిని రుచి చూస్తే బాగుంటుంది.

మధ్యాహ్నం, సాయంత్రం చాలా మంది స్నాక్స్ గా, బజ్జిలు, పునుగులు, దోస, ఇడ్లీ, గప్ చుప్ తింటుంటారు, అది మానేసి ఆపిల్ ముక్కలు తినండి, గుండెకు బలం, అలాగే దీనిలో పోస్పోరస్ అధిక‌శాతం ఉంటుంది. దీని మూలంగా మలం బయటికి పోయి గ్యాస్ట్రిక్ తగ్గుంది. గుండె జబ్బులు రావు.

ఇంతకు ముందు ఆపిల్ ధరలు ఆకాశాన్ని ఏంటి ఉండేవి, ఇది పేద వారు తింటానికి అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆపిల్ అధికంగా అన్ని ప్రాంతాలలో పండిస్తున్నారు, అన్ని ప్రాంతాలలో తక్కువ ధరకు లభిస్తుంది.

ప్రతిరోజు రాత్రి నిదురించే ముందు ఆపిల్ రెండు ముక్కలు తింటే చాలు సాధ్యమైనంత వరకు డాక్టర్ తో అవసరం ఉండదు.

హెచ్చరిక: అల్సరేటివ్ కోలైటీస్ జబ్బు వున్నవారు ఆపిల్ అధికంగా తినరాదు.

ఈ రోజు ఇది చదివినవారు దయచేసి కామెంట్ పెట్టండి. కామెంట్ లేకపోతే నాకు మరల ఆర్టిక‌ల్ పెట్టె కిక్కు ఉండదు, అందరు చదవండి, పది మందికి ఈ మెసేజెస్ ఫార్వర్డ్ చేయండి.

-బహార్ అలీ.
ప్రకృతి వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.