శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
తిరుమల (CLiC2NEWS): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజీర్ అహ్మద్, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ గోపిచంద్‌లు దర్శించుకున్నారు.
శ్రీవారికి దర్శించుకున్న అనంతరం తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు..
హుజూరాబాద్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎటమిపై మంత్రి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. నాగార్జున సాగర్, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకున్నామని గుర్తు చేశారు. రాజకీయాలన్నాకా గెలుపోటములు వస్తూ ఉంటాయని మంత్రి తెలిపారు.
స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: దర్శకుడు గోపిచంద్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మీడియాతో మాట్లాడారు..
తమ ఇంటి కులదైవం తిరుమల స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ తో చిత్రం నిర్మిస్తున్నానని గోపిచంద్ తెలిపారు.