ఎన్నో ప్రభుత్వాలు మారాయి… కానీ ప్రజల తలరాత మారలేదు: సిఎం కెసిఆర్

నాందేడ్ (CLiC2NEWS): దేశంలో ఎన్నో ప్రభుత్వాలు, ప్రధానులు మారారు కానీ దేశ ప్రజల తల రాత మాత్రం మారలేదు అని భిఆర్ ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సిఎం కెసిఆర్ తెలపారు. నాందేడ్ లోని గురుగోవింద్‌సింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కె. చంద్రశేఖరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని పలువురు నాయకులకు పార్టీకండువాకప్పి బిఆర్ ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఛత్రపతి శివాజీ, అంబేద్కర్,పూలే వంటి మహానీయులకు జన్మినిచ్చిన పుణ్యభూమి మహారాష్ట్ర అని పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లయింది కానీ ప్రజలకు తాగు నీరు, విద్యుత్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి అని అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఎంత కష్టం చేసి పంటలు పండించినా రైతు ఆత్మహత్యలు ఆగడం లేదని పేర్కొన్నారు. .. అందుకే `అబ్‌కీ బార్ కిసాన్ సర్కాన్` నినాదంతో భారత్ రాష్ట్ర సమితి వచ్చింది అని కెసిఆర్ తెలిపారు.
భారత్ దేశం పేద దేశం కాదు.. అమెరికా కంటేదనిక దేశంల అన్నారు. భారత్‌లో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ ప్రజలు వంచనకు గురవుతున్నారని అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్నదేశంలో ఉందని.. ఇంత పెద్ద విశాల భారత దేశంలో కనీసం రెండు వేల టిఎంసిల రిజర్వాయర్ ఎందుకు లేదని కెసిఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వాలు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కరించడం లేదు.. ట్రిబ్యునళ్లలో యేళ్లకొద్ది పెండింగ్‌లో పెడుతున్నారు.
చిత్తశుద్ధితో కృషి చేస్తే దేశంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వొచ్చని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించొచ్చని పేర్కొన్నారు.
8 యేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండేవి… సాగునీరు, తాగునీరు, విద్యుత్ కొరత ఉండేవి.. క్రమంగా అన్ని సమస్యలు అధిగమించాం.. అలాగే తెలంగాణలో సాగుకు 24 గంటలు కరెంటు ఇస్తున్నామని ,, రైతులకు ఎకరానకి ఏడాదికి రూ. 10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నామని.. అలగే రైతులకు రైతుభీమా కల్పించామని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యంకాదని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. బిఆర్ ఎస్‌కు అధికారమిస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తామని తెలిపారు. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతటా రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వచ్చే పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బిఆర్ ఎస్‌ను గెలిపించాలని కోరారు. దేశంలో బిఆర్ ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.