ఆంధ్రప్రదేశ్ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు..

అమరావతి (CLiC2NEWS): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో ప్రధానంగా 70 అజెండాలపై కేబినేట్ చర్చించి.. పలు కీలక అంశాలపై నిర్ణయాలు చేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణ మీడియాకు వివరించారు. ఈ సంవత్సరం ఉగాదికి అందించే వైఎస్ ఆర్ లా నేస్తం, వైఎస్ ఆర్ ఆసరా, ఇబిసి నేస్తం, వైఎస్ ఆర్ కల్యాణ మస్తు వంటి సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కర్నూలు జిల్లాలో జాతీయ న్యాయవిద్యాలయం ఏర్పాటు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్స్ నియామకానికి కెఏబినేట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 28వ తేదీన జగనన్న విద్యాదీవెన చెల్లింపు.. అదేవిధంగా రైతులకు సబ్సిడీ చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదించింది. లీగల సెల్ అథారిటి ఖాళీ పోస్టుల భర్తీ..విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 1998 డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్యర్థల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.