మార్చిలోనే దంచికొడుతున్న ఎండలు
హైదరాబాద్ (CLiC2NEWS): మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఎండలు గత సంవత్సరం కంటే ముందుగానే మొదలయ్యాయి. మే నెలలో రావాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే నమోదవుతున్నాయి. దాంతో ఈ నెలలో భానుడి ప్రతం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతతో పలు నగరాల్లో రోడ్ల మీద జనాలు కనిపించడం తగ్గిపోయింది. ఇప్పడే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటే రానున్న రెండు నెలలు ( ఏప్రిల్, మే) ఎండతీవ్ర ఏ స్థాయిలో ఉంటుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్ మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటి కే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నల్లగొండ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడు భానుడు సెగలు కక్కుతున్నాడు. ఉదయం 11 దాటితే జనం బయట తిరగడానికి జంకుతున్నారు. గత వారం రోజుల నుంచి రోజుకో డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలోని మహానగరా్లలో ఎండులు మండుతున్నాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. నగర వాసులకు భానుడు భగభగతో ముచ్చెమటలు పడుతున్నాయి. నగరంలో ఈ మధ్య ఉష్ణోగ్రతలు దాదాపు 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇకపై మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోకి ఎండ తీవ్రత అధికమవుతోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ కోల్ బెల్డ్ ప్రాంతాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎండ తీవ్రత ఇంకెత ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రది, గోలేటి తదితర సింగరేణి ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఓపెన్ కాస్టుల్లో భానుడి ప్రతాపానికి సంగరేణి కార్మికులు అల్లాడిపోతున్నారు.