ఎన్నారై, ఒసిఐలతో వివాహం .. న్యాయ కమిషన్ కీలక సూచనలు
ఢిల్లీ (CLiC2NEWS): ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా – భారతీయుల మధ్య వివాహం జరిగితే భారత్‌లో తప్పనిసరిగా నమోద చేయాలని న్యాయ కమిషన్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఎన్నారైలను వివాహం చేసుకున్న ఎంతో మంది మహిళలు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళుతున్నారని కొన్ని నివేదికలు ప్రస్తావించాయిన న్యాయ కమిషన్ ఛైర్‌పర్సన్, విశ్రంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్తి పేర్కొన్నారు. మోసపూరిత వివాహాలు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయకిమషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పెళ్లిళ్లకు సంబంధించి ఓ సమగ్ర తీసుకోవాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ వివాహాలను భారత్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది.
విడాకులు, మనోవర్తి, పిల్లల సంరక్షణ, ఎన్నారైలు, ఒసిఐలకు సమన్లు, వారెంట్లు , ఇతర న్యాయపరమైన పత్రాల జారీకి సంబంధించిన నిబంధనలను సమగ్ర చట్టంలో చేర్చాలని సూచించారు. పాస్‌పోర్టుపై వివాహ స్టేటస్, జీవిత భాగస్వామి పాస్‌పోర్ట్‌ను అనుసంధానించడం, భార్యాభర్తలిద్దరి పాస్‌పోర్టులపై వివాహ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందుపర్చడం వంటివి తప్పనిసరి చేయడానికి పాస్ పోర్ట్ చట్టం 1967 లో అవసరమైన సవరణలు తీసుకురావాలని న్యాయకమిషన్ సిఫార్సు చేసింది.