తిరుపతిలో వివాహిత పద్మ మిస్సింగ్ కేసు.. హత్య చేసి సుట్కేసులో పెట్టి..
తిరుపతి (CLiC2NEWS): నగరంలోని సత్యనారాయణపురంలో వివాహిత పద్మావతి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. పద్మావతి భర్తే హత్య చేసినట్లు తేల్చారు. నగర శివారులోని వెంకటాపురం చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాప్టవేర్ ఇంజినీర్ వేణుగోపాల్, పద్మకు 2019లో వివాహం జరిగింది. కొన్నేళ్లు వీరు బాగానే ఉన్నా.. కుటుంబ కలహాలతో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దిశా పోలీస్ స్టేషన్లో పద్మ భర్తపై ఫిర్యాదు చేసింది. పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేణుగోపాల్, అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కొంత కాలం బాగానే ఉన్నారు. మళ్లీ విభేదాలు తలెత్తడంతో.. పద్మ పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ అత్తమామలకు నచ్చజెప్పి భార్యను తన ఇంటికి తీసుకొచ్చాడు. జనవరి 5న పద్మను చంపేసి సూట్‌కేసులో పెట్టి తిరుపతి శివారులోని వెంకటాపురం చెరువులో పడేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. పద్మను తీసుకెళ్లినప్పటినుండి తనతో ఉన్నట్లు అత్తమామలను నమ్మించాడు.
ఐదు నెలలగా తమ కుమార్తెతో మాట్లాడనీయకుండా చేయడంతో పద్మ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హైదరాబాద్ నుండి వేణుగోపాల్‌ను రప్పించి విచారించగా.. తనే హత్య చేసి చెరువులో పడేసినట్లు తెలిపాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు.
I know this if off topic but I’m looking into starting my own weblog and was curious what all is needed to get
setup? I’m assuming having a blog like yours would cost
a pretty penny? I’m not very internet savvy so I’m not 100% positive.
Any tips or advice would be greatly appreciated. Appreciate it