ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి

నారాయణపూర్ (CLiC2NEWS): ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. నారాయణపూర్ జిల్లాలో ధనంది-కుర్రేవాయ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్ఉల ఐజి సుందర్రాజ్ వెల్లడించారు. ఖోకామెటా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులన్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ఫోర్స్, బిఎస్ ఎఫ్, ఐటిబిపి దళాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకశామున్నట్లు తెలుస్తోంది.