ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 29 మంది మావోయిస్టులు మృతి
రాయ్‌పుర్ (CLiC2NEWS): లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
బిఎస్ ఎఫ్, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇరుపక్షాల మధ్య ఎన్కౌంటర్ మొదలైనట్లు బిఎస్ ఎఫ్ తెలిపింది. మరణించిన వారిలో మావోయిస్టు కీలకనేత శంకర్ రావు ఉన్నట్లు తెలుస్తోంది. అతనిమీ రూ. 25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో బిఎస్ ఎస్ ఇన్స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం.