బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు: నలుగురు మృతి

విరుదునగర్ (CLiC2NEWS): తమిళనాడులోనివిరుదునగర్ జిల్లా సాత్తూర్‌లో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతులలో ఫ్యాక్టరీ యజమాని కూడా ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకసిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. కొత్త సంవత్సరంలో రెండవసారి ఈ ప్రమాదం జరిగింది. ఈనెల 1వ తేదీన జరిగిన పేలుడు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.