షాపింగ్‌మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి
బాగ్ధాద్: ఇరాక్‌లోని ఓ షాపింగ్ మాల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ అగ్ని ప్రమాదం ఆల్‌కుట్ ప్రాంతంలోని ఐదంతస్థుల షాపింగ్ మాల్లో జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం ధాటికి భవనమంతా మంటల్లో చిక్కుకుని చాలా భాగం ధ్వంసంమైనట్లు తెలుస్తోంది.