భారీగా పెరిగిన బంగారం, వెండి ధర

భారీగా పెరిగిన బంగారం, వెండి ధర

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరల్లో హెచ్చు త‌గ్గులు చోటుచేసుకుంటున్నాయి. అయితే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలతో పసిడికి మళ్ళీ రెక్కలు వచ్చాయి.

ఈ విషయంపై మార్కెటింగ్ నిపుణులు స్పందిస్తూ.. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా , ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి వివిధ అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని తెలిపారు.

నిన్నటి నుంచి బంగారం ధ‌ర మళ్లీ పెరుగుతూ పోతోంది..

  • హైదరాబాద్:
    మార్కెట్‌లో రూ.380 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,840కు చేరింది.
    10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగడంతో రూ.43,850కి పెరిగింది.
  • వెండి ధర కూడా పసిడి బాటే పట్టింది.. ఇవాళ రూ.1300 పెరగడంతో కిలో వెండి ధర రూ.65,100కు చేరింది.
  • ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.
  • ముంబయి:
    ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,360
    24 క్యారెట్ల బంగారం ధర రూ.46,360
  • చెన్నై:
    22 క్యారెట్ల బంగారం ధర రూ.44,100
    24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110
Leave A Reply

Your email address will not be published.