షాకింగ్ న్యూస్‌: భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): గత ఏడాది కరోనా సమయంలో బంగారం ధరలు ఆల్ టైం హై కి వెళ్లిన విష‌యం తెలిసిందే. అప్పటి నుంచి హెచ్చుతగ్గులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఆడవారు బంగారాన్ని ఆస్తిగా భావిస్తుంటే.. వ్యాపారవేత్తలు బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్న నేపథ్యంలో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఈ మ‌ధ్య కాలంలో తగ్గుతూ వ‌చ్చి ప‌సిడి ప్రేమికుల‌కు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఆ ధ‌ర‌లు పైపైకి వెళ్తున్నాయి.

తాజాగా బుధ‌వారం కూడా బంగారం ధ‌ర‌లు పెరిగాయి. పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు..

  • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ.45,250
  • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.280 పెరిగి రూ.49,370

వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా ప‌త‌నం అవుతున్నాయి.

  • కిలో వెండి ధ‌ర రూ.600 వ‌ర‌కు తగ్గి రూ. 72,300కి చేరింది.
Leave A Reply

Your email address will not be published.