నల్లగొండకు ఆర్టీసీ బస్సులో వెళ్లిన ఎండీ సజ్జనార్
నల్లగొండ (CLiC2NEWS): ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టి సారించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి నల్లగొండకు ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. ఈ పర్యటనలో నల్లగొండ డిపో, బస్టాండ్‌ను పరిశీలించారు. బస్టాండ్‌లో సౌకర్యాలపై ప్రయాణికులతో ముచ్చటించి, అనంతరం
అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివాహలు, విహార యాత్రలకు, రైతుల ధాన్యం తరలింపునకు ఆర్టీసీ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. బస్టాండ్లలో ఎమ్మార్పీ ధరలకే వస్తువులను అమ్మాలని, ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోవద్దని షాపుల యజమానులను హెచ్చరించారు. అలాగే ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు తెలపాలని సజ్జనార్ సూచించారు.
హైదరాబాద్ నుంచి నల్లగొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి. #Nalgonda నల్లగొండ బస్టాండ్‌లో తనిఖీలు చేయడం జరిగింది #TSRTC సౌకర్యాల గురించి అక్కడ ఉన్న ప్రయాణికుల అభిప్రాయాలను స్వయంగా స్వీకరించాను #greenindiachallenge@MPsantoshtrs @TV9Telugu @sakshinews @TelanganaToday @IPRTelangana pic.twitter.com/ZpTWRnL0Pd
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 6, 2021