మేడారం మహాజాతర ..

హైదరాబాద్ (CLiC2NEWS):నేడు మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. సారలమ్మ ను గద్దెలపైకి తీసుకురానున్నారు. వన దేవతలను దర్శించుకొనేందుకు గద్దెల వద్ద భారీగా జనం తరలి వచ్చారు. తాడ్వాయి మండలం కన్నెపల్లి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సారలమ్మ మేడారానికి బయలు దేరింది. గిరిజన సాంప్రదాయం ప్రకారం సారలమ్మను కోయ పూజారులు డోలు, డప్పు వాయిద్యాలతో జంపన్నవాగు దాటి గద్దెల పైకి చేర్చుతారు. నెల రోజుల ముందునుండే భక్తులు మేడారంకు పోటెత్తారు. సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు.