రూ.3లక్షల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ఎఒ
మెడికల్ కాలేజి అడ్మినస్ట్రేటివ్ అధికారి, జూనియర్ అసిస్టెంట్
కొత్తగూడెం (CLiC2NEWS): ప్రభుత్వ వైద్యకళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి, జూనియర్ అసిస్టెంట్ రూ.3లక్షలు లంచం తీసుకుంటా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం సర్వజనాసుపత్రిలో ఓ ఏజెన్సీ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఆరు నెలల క్రితం 48 మంది కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. వారి జీతాలకు సంబంధించిన బిల్లులను సదరు ఏజెన్సీ సమర్పించింది. వాటికి ఆమోదం తెలిపేందుకు కళాశాల అడ్మినస్ట్రేటివ్ అధికారి ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ఆలస్యం చేస్తున్నారు. దీంతో ఏజెన్సీ అధికారులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా కూడా వారు రెండు నెలల బిల్లులు మాత్రమే విడుదల చేశారు. మిగాతా నెలల బిల్లులకు ఆమోదం తెలపాలంటే రూ.15 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారు ఎసిబిని ఆశ్రయించారు.
ఎసిబి వ్యూహంలో బాగంగా నిర్వాహకులు అడ్మినస్ట్రేటివ్ అధికారి, జూనియర్ అసిస్టెంట్‌తో బేరాసారాల జరిపి రూ.7లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిలో బాగంగా మొదట రూ.3లక్షలు మంగళవారం చెల్లించే క్రమంలో ఎసిబి అధికారులు పట్టుకున్నారు.