కోల్ ఇండియాలో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు
Coal India: మెడికల్ విభాగంలో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి కోల్ ఇండియా లిమిటెడ్, కోల్‌కతా దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 72 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులను ఏప్రిల్ 11వ తేదీలోపు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాల్లో ఎంబిబిఎస్, పిజి డిగ్రీ, డిఎన్‌బి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటిలో చదివి ఉండాలి. దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా.. ద జనరల్ మేనేజర్ (పర్సనల్ )/ హెచ్ొడి (ఇఇ), ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్ మెంట్ డిపార్ట్ మెంట్, 2 ఫ్లోర్, కోల్ ఎస్టేట్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సివిల్ లైన్స్, నాగ్‌పూర్, మహారాష్ట్ర-440001. వెబ్‌సైట్ https://www.coalindia. in/career-cil/jobs-coal-india/
సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 42 ఏళ్ల లోపు ఉండాలి. (ఒబిసి అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.) నెలకు రూ. 70,000 రెండి రూ. 2,00,000 జీతం అందుతుంది.
సీనియర్ మెడికల్ ఆఫీసర్ లేదా మెడికల్ స్పెషలిస్ట్ లకు 35 ఏళ్ల లోపు ఉండాలి. (ఒబిసి అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.) నెలకు రూ. 60,000 రెండి రూ. 1,80,000 జీతం అందుతుంది.