రణపాల మొక్కలో వున్న ఔషధ‌ గుణాలు..

 

రణపాల శాస్త్రీయ నామము. కలాంచో పిన్నాట.
కుటుంబము. క్రస్సులేసి
సంస్కృతంలో వర్ణ బీజ అంటారు.

భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో తోటలలో కూడా ఇది చాలా చోట్ల నాటినారు. ఇది శాశ్వత మొక్క.
దీని కాండం లేత ఎరుపు, లేదా ఆకు పచ్చ, మరియు మూడు నాలుగు అంగుళాల వరకు పొడవు ఉంటుంది. ఆకులు లోపల కండగలిగినవి, దిగువ ప్రాంతం యొక్క ఆకులు సరళంగా ఉంటాయి. మరియు ముందు భాగం సమ్మేళనంలో కరపత్రాల సంఖ్య 6, లేదా 7 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కటి వ్యతిరేక క్రమంలో కనబడతాయి మొలకెత్తిన రెమ్మలు,ఆకులు గుండ్రటి అంచు పొడవైన కమ్మిలా నుండి ఉద్భవిస్తాయి.దీని ఫలితంగా సంతానము పెరుగుతుంది. పెద్ద గొట్టపు హేమారాయిడ్స్, ఆకుపచ్చ మరియు క్రిందికి వంపు తిరిగినవి రెండు పొడవుగా ఉంటాయి.దీని ఆకులు గొప్ప సువాసన కలిగి ఉంటాయి.

దీని గుణధర్మాలు.
ఇది స్టోన్ బ్రేకర్,వస్థి ప్యూరిఫైయర్, త్రిదోష నాసిని. పైల్స్ ట్యూమర్స్ విరోచనాలు మరియు అల్సర్లను నాశనం చేస్తుంది. ఆకులు వ్రణం ఉత్పత్తి మరియు రక్తాన్ని పల్చగా చేస్తాయి. రక్తస్రావము గాయాలు ఉబ్బసంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. మరియు గనేరియా, దాహము అజిద్ది, కడుపునొప్పి,శ్వాస కోస వ్యాధులు, దగ్గు మూర్చ మూత్రనాళాల అవరోధంలో దీని ఆకుల రసం 5 ml ఉపయోగిస్తాం.
ఇది మూత్రంలో రాళ్లు మూత్రం నాళాలకు ప్రసిద్ధి ఆయుర్వేద ఔషధం. పాషణ భేద, ఫంగస్ డైసురియాను నాశనం చేస్తుంది. మరియు ఏన్యుయేషన్ నొప్పిని ఉపశమనం చేస్తాయి.

దీని ఉపయోగాలు.
1. గాయము పుండ్ల నుండి కలిగే రక్తస్రావములు అదుపులో పెట్టే ప్రసిద్ధిమూలిక.
2. ఆకు రసం ను వ్రణం నందు పూరించినను అది ముద్దను లేపనము చేసి కట్టినను వ్రణములు మానును. రక్తస్రావం అన్ని రకముల వ్రణములు తగ్గిస్తుంది. కనుక దీన్ని రణపాల మరియు వ్రణపాల అని పేరు.
3. రక్తంతో కూడిన బంక విరోచనములను దీని ఆకురసము రెండు tea స్పూన్స్ ఆవు నెయ్యి కలిపి తాగించిన అహితముగా ఉండును.
4. ఆకులు పచ్చడి చేసి గాని పప్పులో వేసి గాని బండి తిన్నట్లయితే మూల వ్యాధి నశించిన.
5. ఆకులు కట్టినచో సెగ గడ్డలు పగిలిపోవును.
6. శిరవేదన దీని ఆకుల్ని మెత్తగా దంచేసి దీన్ని తల మీద కొద్దిసేపు పెట్టినట్లయితే శిరోవేదన మీద తగ్గుతుంది.
7. మూత్రంలో రాళ్లు ఉన్నట్లయితే దానికి 40 నుంచి 50 ఎంఎల్ కషాయం తీసుకుంటే చక్కగా రాళ్లు పగిలి బయటకు పోవును.
8. స్త్రీలకు యోనిస్రావం అయినట్లయితే 40 లేదా 60 మిల్లీమీటర్ క్వాద్ లో రెండు గ్రాములు తేనే కలిపి రోజుకు మూడుసార్లు ఇవ్వాలి.
9. దీని స్వరసము రోజు 5 గ్రాములు తీసుకున్నట్లయితే అజీర్తి తగ్గుతుంది.
10. చిన్న చిన్న దెబ్బలు గాని గాయాలు గాని పుండ్లు గాని అయినట్లయితే దీన్ని చక్కగా మెత్తగా దంచి వేడి చేసి రోగగ్రస్తం ప్రాంతం మీద రాసినట్లయితే ఆవి చక్కగా తగడం జరుగుతుంది.
హెచ్చరిక…
దీని ఆకుల రసం ఎక్కువ తీసుకున్నట్లయితే మత్తు ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకు దీన్ని చక్కగా వాడుకోండి స్వంత ప్రయత్నాలు దయచేసి చేయవద్దు.

-షేక్ బహార్ అలీ
ఆయుర్వేద వైద్యులు

Leave A Reply

Your email address will not be published.