సినీ న‌టి మీనా ఇంట్లో తీవ్ర విషాదం.. పోస్టు క‌రోనా స‌మ‌స్య‌ల‌తో భ‌ర్త హ‌ఠాన్మ‌ర‌ణం

చెన్నై (CLiC2NEWS): ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భ‌ర్త విద్యాసాగ‌ర్ అనారోగ్యంతో మంగ‌ళ‌వారం రాత్రి హ‌ఠాత్తుగా మృతి చెందారు. ఇటీవ‌ల పోస్టు కొవిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న విద్యాసాగ‌ర్ చెన్నైలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

తెలుగు, త‌మిళ సినీ పరిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగిన మీనా 2009 సంవ‌త్స‌రంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విద్యాసాగ‌ర్‌తో వివాహం జ‌రిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. పాప పేరు నైనిక, ద‌ళ‌ప‌తి హీరోగా వ‌చ్చిన తేరీ సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించింది. మీనా వివాహం అనంత‌రం కూడా ప‌లు సినిమాల్లో న‌టించింది.

కాగా మీన భ‌ర్త విద్యాసాగ‌ర్ గ‌త కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడు. దీనికి తోడు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మీనా కుటుంబ స‌భ్యులంద‌రు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ స‌మ‌స‌యంలో విద్యాసాగ‌ర్ ఆరోగ్య‌ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. ఊపిరి తిత్తుల ప‌నితీరు మ‌రింత క్షీణించింది.

2 Comments
  1. Full Article says

    What’s up mates, how is all, and what you wish for to say
    about this Full Article, in my view its genuinely remarkable in support of me.

  2. visit the site says

    Very rapidly this web page will be famous among all blog users,
    due to it’s pleasant posts

Leave A Reply

Your email address will not be published.