బ్రిటిష్ డిప్యూటి హైకమిషనర్‌తో మెగాస్టార్ భేటీ..

హైదరాబాద్ (CLiC2NEWS): మెగాస్టార్ చిరంజీవి నివాసంలో బ్రిటిష్ డిప్యూటి హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌తో చిరు భేటీ అయ్యారు. వీరిరువురు మధ్య యుకె – భారత్‌ల మధ్య వ్యవహారాలు, తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడినట్లు సమాచారం. అనంతరం ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని తెలిపారు. బ్రిటిష్ డిప్యూటి హైకమిషనర్ గారెత్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆవకాయతో సహా మన సంప్రదాయ వంటలను ఆయనకు రుచి చూపించానని చిరంజీవి తెలిపారు. గారెత్.. నాజీవితాంతం ఈ సాయంత్రాన్ని గుర్తుపెట్టుకుంటానని.. మీ రక్తదాన కేంద్రాల్లోని ఒక దానిలో మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా అని ట్విటర్ ద్వారా తెలిపారు.