యాదాద్రి స్వ‌ర్ణ‌తాప‌డం కోసం మేఘా ఇంజినీరింగ్ 6 కేజీల బంగారం విరాళం

హైద‌రాబాద్ (CLiC2NEWS): యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌య విమానగోపురానికి బంగారు తాపడం చేయిస్తున్నామని ముఖ్య‌మంత్రి కెసిఆర్ వెల్లడించారు. మంగళవారం యాదాద్రి లో ప‌ర్య‌టించిన సిఎం కెసిఆర్‌.. సాయంత్రం అక్క‌డ మీడియాతో మాట్లాడారు… స్వామివారి గర్భగుడిపైన ఉండే విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు. యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం సీఎం కేసీఆర్ తొలుత త‌న వంతుగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్ర‌క‌టించిన విష‌యం విదితమే. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌ను స్ఫూర్తిగా తీసుకుని యాదాద్రి ఆల‌యానికి ప‌లువురు ప్ర‌ముఖులు బంగారాన్ని విరాళంగా ప్ర‌క‌టిస్తున్నారు

ఈ క్ర‌మంలో యాదాద్రి విమాన గోపురం బంగారం తాపడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ 6 కేజీల బంగారాన్ని విరాళంగా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఆరు కిలోల బంగారం సమర్పిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది.

ఈ సందర్భంగా MEIL డైరెక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం కార్యక్రమంలో మేం పాలుపంచుకోవడం మాకు ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని ఆయ‌న అన్నారు.

Leave A Reply

Your email address will not be published.