విజయ్ – ‘లియో’ నుండి మెలోడియస్ సాంగ్ ..

Leo: విజయ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి ప్రేమా ఓ ఆయుధం అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అనిరుధ్ సంగీతం.. సుధాన్షా, ప్రియా మాలి ఆలపించారు.