Bahar Ali: మానసిక ఆందోళన కారణాలు, రోగనిర్ధారణ!

మానసిక ఆందోళన గురించి…
మన భారత దేశము శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించింది. కాలం మన కోసం ఆగదు.. కాలం పరిగెత్తుతా ఉంటుంది. కాలంతోపాటు మనం కూడా పరిగెత్తడం పరిపాటైపోయింది. మర్చిపోయి మనం పరిగెత్త లేకపోతే ఎక్కడ వేసిన తిష్ట అక్కడే అలానే ఉంటుంది. మనం పరిగెత్త లేకపోతే కాలంతోపాటు మనం అక్కడే నిలిచిపోతాం. నిన్నటి వింత నేడు ఒక పాతగా మారింది. నిరంతరం అన్వేషణ జరుగుతూనే ఉండాలి అప్పుడే ప్రగతి సాధిస్తాం. ఈ నిరంతర అన్వేషణ ఆగిపోతే ప్రగతి సాధించలేం. మనం ఏదైనా చేయాలనుకుంటే కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోవాలి, ఇప్పుడే మనకు జయం మనదే అవుతుంది. జయం వచ్చిందని మనం అక్కడితో అన్వేషణ ఆపితే ప్రగతి ఆగిపోతుంది. ఎంత సాధించినా సరే మనకు తృప్తి ఉండదు, ఏదో ఎక్కడో వేల్తిగా కనపడుతూనే ఉంటుంది. ఇంకా ఇంకా కావాలనే తపన ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కడు నిరంతరం ఒకరికొకరు పోటీ పడుతూనే ఉంటారు. పోటి ప్రపంచంలో మానవుడు క్రూరంగా కృత్రిమంగా మారిపోతున్నాడేమో?
మానసిక ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య. ప్రతి మనిషి ఏదో ఒక విధంగా మానసిక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ఈ మానసిక బాధ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక ఇబ్బందులకు గురవుతాం. న్యూరోటిక్ పర్సనాలిటీ మరియు జెనిటిక్ ఫ్యాక్టర్స్ తో పాటు దీర్ఘకాలంగా ఆల్కహాల్ తాగుతూ విత్ డ్రా అయిన వారిలో అపస్మారము, థైరాయిడిజం, హైపోగ్లసిమియా, ఇవన్నీ మానసిక ఆందోళనతో వచ్చే వ్యాధులు.. మనసుకు బాధ కలిగించే సంఘటనలు, ఇంట్లో ఇబ్బందికరమైన వాతావరణం, ప్రేమలో వైఫల్యం, మరి విద్యలో అనుకున్న మార్కులు రాకపోవటం, ప్రేమలో వైఫల్యము, ఆర్థిక ఇబ్బందులు, అనుకున్న పని ఏది సాధించలేక పోతే ఇలాంటివి మానసిక ఆందోళన కారకాలు అవుతాయి.
వ్యాధి లక్షణాలు.
- గుండె దడ, నోరు ఎండిపోవడం తలనొప్పి రావడం
- తల తిరుగుట, చేతులు కాళ్లు వణుకుడు , ఏకాగ్రత లోపం
- పీడ కలలు, తొందరగా అలసిపోవడం జరుగుతుంది. నిద్ర పట్టకపోవడం
- సడన్ గా భయం రావడం.. కంగారు పుట్టటం
- అరికాళ్ళలో అరచేతుల్లో చేతుల్లో చెమటలు పుట్టటం,గుండె స్పీడ్ కొట్టుకోవడం జరుగుతుంది
- మూత్ర విసర్జన ఎక్కువ రావటం, మతిమరుపు ఛాతి నొప్పి ఆయాసం రావడం
ఔషధ చికిత్స
- ఒక గ్లాసు నీళ్లలో ఐదు తులసి ఆకులు వేసి డికాషన్ కాసి ఉదయం తాగటం
- పెన్నేరు చూర్ణం ఉదయం సాయంత్రం పాలల్లో తీసుకోవడం వల్ల కూడా మానసిక చింత తగ్గుతుంది
- ధార చికిత్స కూడా మానసిక ఆందోళన తగ్గిస్తుంది.
- కొన్ని నియమాలు పాటిస్తే మానసిక ఆందోళన నుంచి విముక్తి చెందవచ్చు.
- ప్రతిరోజు తెల్లవారుజాము బ్రహ్మ ముహూర్త కాలం 4:00 కి లేవాలి. లేవగానే రెండు గ్లాసులు నీళ్లు తాగాలి. మలమూత్ర విసర్జన చక్కగా చేసుకుని కాలాన్ని బట్టి చక్కని నీటితో స్నానం చేయాలి.
- శరీరానికి సుబ్రమైనటువంటి తెల్లటి వస్త్రములు ధరించాలి.
- పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చక్కని ప్రదేశంలో గాలి వీచే ప్రాంతంలో కూర్చోవాలి.
- కింద కూర్చుంటున్నప్పుడు ఒక చక్కటి దుప్పటి వేసుకొని దానిమీద కూర్చోవాలి.
- ముందుగా ధ్యానముద్రని ఒక ఐదు నిమిషాలు చేయాలి.
- తర్వాత సూర్య నమస్కారాలు పది సార్లు చేయాలి
- తర్వాత శవాసనం పది నిమిషాలు వేయాలి.
- చక్కని పుస్తకాలు చదవాలి, మంచి సంగీతం వినాలి సాయంత్రం అస్తమించే సూర్యుని ఎదురుగా కూర్చోవాలి చక్కగా ధ్యానం చేయాలి.
మానసిక ఆందోళన ఎక్కువైతే డాక్టర్ని సంప్రదించండి తర్వాత యోగ మాస్టారునీ కూడా సంప్రదించి యోగాసనాలు నేర్చుకుని చక్కగా మానసిక ఆందోళన నుండి విముక్తి పొందండి.
-షేక్. బహార్ అలీ
యోగాచార్యుడు, ఆయుర్వేద వైద్యుడు