ప్రధానమంత్రి భద్రతకు మెర్సిడెస్-మేబాక్ ఎస్-650 గార్డ్ కారు
దేశ ప్రధానమంత్రి భద్రతాదళం రెండు ఎస్-650 గార్డ్ కార్లను కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ హైసెక్యూరిటి ఎడిషన్, రేంజ్‌రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లను వినియోగించారు. ఈక్రమంలో ప్రధానమంత్రి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు రూ. 12కోట్లకుపైగా ఖరీదు చేసే ఎస్-650 గార్డ్ కారును వినియోగిస్తోంది. ఈ కారు వీఆర్-10 స్థాయి భద్రతను కల్పిస్తుంది. ఎస్-650 గార్డ్ కారు బాడి, విండోస్ ఎకె-47 తూటాలను తట్టుకొని నిలబడతాయి. ఇది దాదాపు రెండు మీటర్ల దూరంలోపు జరిగే 15 కిలోల టిఎన్‌టి పేలుడు శక్తి నుండి ప్రయాణికులనున కాపాడుతుంది. కారు కింద జరిగే పేలుడు నుండి తట్టుకొనేలా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ కారు టైర్లకు పంక్చర్లు పడినా, దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.